Sep 15,2023 23:22

అదృశ్య యువతి తల్లిదండ్రులకు అప్పగింత




అదృశ్య యువతి తల్లిదండ్రులకు అప్పగింత
ప్రజాశక్తి -సోమల: సోమల మండలం అన్నెమ్మ గారి పల్లి పంచాయతీ బోనమంద గ్రామా నికి చెందిన ఆనంద కుమార్తె గీత(18) చదువు కుంటూ ఉండగా తల్లిదండ్రులు వివాహం చేయాలని సంబంధాలు చూస్తుండడంతో ఇంటి నుండి పారిపోవడంతో సోమల పోలీసులకు గత నెల 28 న తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎస్సై వెంకట నరసింహులు ఆధునిక పరిజ్ఞానంతో యువతి ఆచూకీ కనుక్కొని గంగవరం మండలం గొర్రెల దొడ్డి గ్రామంలోని తన చిన్నాన్న ఇంటి వద్ద ఉండగా సోమలకు తీసుకువచ్చి శుక్రవారం తహసిల్దార్‌ మాధవ రాజు ఎదుట హాజరు పరిచి తల్లిదండ్రు లకు అప్పగించారు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.