Aug 13,2023 21:31

మహిళలకు నమస్కరిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షులు ఇన్‌ఛార్జి టిసి వరుణ్‌

          ప్రజాశక్తి-అనంతపురం    వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇన్‌ఛార్జి టిసి వరుణ్‌ కోరారు. జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ ఆశయాలు, సిద్ధాంతాలను వివరిస్తూ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధిపై రూపొందించిన మేనిఫెస్టోను వివరిస్తూ చేపట్టిన జనసేన జయభేరి కార్యక్రమం ఆదివారం 41వ డివిజన్‌లోని జనశక్తి నగర్‌లో అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము మాటలు చెప్పేరకం కాదని, అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు. అన్నివిధాలా మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా కాలనీలో డ్రెయినేజీ వల్ల అనారోగ్య బారిన పడుతున్నా, స్థానిక ఎమ్మెల్యే ఇలాంటి చొరవ తీసుకోలేదని వాపోయారు. వైసిపి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ న్యాయం జరగడం లేదన్నారు. కావున జనసేన పార్టీని గెలిపిస్తే అనంత నగర రూపురేఖలే మారిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షులు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శులు కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు సంజీవరాయుడు, చొప్ప చంద్ర, కిరణ్‌కుమార్‌, సిద్ధూ, జయమ్మ, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్‌, రోళ్ల భాస్కర్‌, దరాజ్‌ బాషా, నగర కార్యదర్శులు సువర్ణమ్మ, కుమ్మర మురళి, విశ్వనాథ్‌, లాల్‌స్వామి, అంజి, సంపత్‌, వడ్డే వెంకటేష్‌, వెంకటరమణ, ఆకుల అశోక్‌, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్‌కుమార్‌, నాయకులు చిరు, హిద్దు, రహీంబాషా, మహేష్‌, హర్ష, విజరుదేవ్‌, నౌషాద్‌, వీరమహిళలు లావణ్య, సుజాత, మమత, రోహిణీ, అనసూయ, దాసరి సరిత, తదితరులు పాల్గొన్నారు.