Oct 30,2023 21:34

విజేతకు కప్‌ అందజేస్తున్న దృశ్యం

విజేతకు కప్‌ అందజేస్తున్న దృశ్యం
అదానీ వరల్డ్‌ స్కూల్‌లో
ముగిసిన అథ్లెటిక్స్‌ పోటీలు
ప్రజాశక్తి-ముత్తుకూరు:కష్ణపట్నం అదాని స్కూల్‌లో 2023-24 సంవత్సరం కి గాను సిబిఎస్‌ఇ క్లస్టర్స్‌ -7 అథ్లెటిక్స్‌ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈనెల 26వ తేదీన మొదలైన ఈ పోటీలు 29వ తారీఖు వరకు నిర్వహించడం జరిగింది. సోమవారం స్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదానీ వరల్డ్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ సత్యనారాయణ సిరియాల విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు నిర్వహించిన అథ్లెటిక్‌ పోటీలలో ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రలలోని సుమారు 79 పాఠశాలల నుంచి 800 మందికి పైగా విద్యార్థులు వారి కోచ్‌లతో పాల్గొన్నారనీ తెలియజేశారు. ఈ అథ్లెటిక్స్‌లో భాగంగా విజేతలకు వారికి బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందచేయడం జరిగింది. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్కూల్‌ సిబ్బంది పాల్గొన్నారు.