Oct 25,2023 20:22

జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం

ప్రజాశక్తి-నెల్లూరు : వైసిపి జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం నగరంలోని ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కార్యాలయానికి చేరుకున్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పుష్పగుచ్చాన్ని అందజేసి పుట్టిన రోజు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, విజయా డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పోరేషన్‌ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.