Nov 01,2023 21:25

ఫొటో : మాట్లాడతున్న ఎంఇఒ తోట శ్రీనివాసులు

అచీవ్‌మెంట్‌ సర్వే పరీక్షపై అవగాహన
ప్రజాశక్తి-ఉదయగిరి : స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే పరీక్షపై ఎంఇఒ-2 తోట శ్రీనివాసులు అవగాహన కల్పించారు. బుధవారం మండల పరిధిలోని జిల్లా ఉన్నత పాఠశాల వెంగళరావు నగర్‌, ఎపిఆర్‌ఎస్‌ గండిపాలెం, జిల్లా ఉన్నత పాఠశాల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల మెయిన్‌ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్‌ 3న జరగబోవు స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్మెంట్‌ సర్వే పరీక్షపై జిల్లా ఉన్నత పాఠశాల వెంగళరావు నగర్‌లో 3,6,9 తరగతుల విద్యార్థులకు, ఎపిఆర్‌ఎస్‌ గండిపాలెంలో 6,9 తరగతుల విద్యార్థులకు, జిల్లా ఉన్నత పాఠశాల గండిపాలెంలో 9వ తరగతి విద్యార్థులకు పరీక్షపై అవగాహన కల్పించారు.
అనంతరం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పరిశీలించి రుచి చూస్తూ విద్యార్థులకు భోజనం ప్రతిరోజు రుచి శుచికరంగా మెనూ ప్రకారం నాణ్యతగా తయారు చేయాని, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. భోజనానికి ముందు ప్రతీవిద్యార్థి చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కునే విధంగా ఉపాధ్యాయులు పరిశీలిస్తూ ఉండాలన్నారు.