Apr 09,2023 20:46

ప్రజాశక్తి - పాలకొల్లు
పట్టణంలోని 17వ వార్డు అచ్చుగట్లపాలెంలో 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. వార్డు ఇన్‌ఛార్జి, చినగోపురం ఛైర్మన్‌ గాదె వెంకన్న సారధ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు తిరిగి జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
ఉండి : మండలంలోని ఎండగండి, చెరుకువాడ, అర్తమూరు గ్రామాల్లో ఆదివారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని వైసిపి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసిపి నాయకులు మాట్లాడుతూ గతంలో పార్టీలు విజయం సాధించిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను తొలగించే వారని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టిన నుంచి ఇప్పటివరకు ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు పనిచేస్తున్నారన్నారు. వాలంటీర్లకు తోడుగా గృహసారధులు, సచివాలయ కన్వీనర్లను నియమించారని, వారు సమన్వయంతో ప్రజలకు సేవలందించాలని తెలిపారు. కార్యక్రమంలో చేబ్రోలు బాలాజీ, వేగేశ్న వేణు, గోనబోయిన వెంకటేశ్వరరావు, టోనీ బాబు, జొన్నల వజ్రం పాల్గొన్నారు.