May 17,2023 20:59

పజాశక్తి - పాలకొల్లు రూరల్‌
భగ్గేశ్వరం గ్రామంలో 122వ రోజు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, ఎంఎల్‌సి కవురు శ్రీనివాస్‌ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నవరత్నాల వివరాలు కలిగిన కరపత్రాలను ప్రతి ఇంటికీ పంచారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు. ఏ సమస్య ఉన్నా స్థానిక అధికారుల ద్వారా తమకు తెలియజేయాలని కోరారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే జగన్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గుణ్ణం నాగబాబు, మాజీ డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ యడ్ల తాతాజీ, గ్రామ అధ్యక్షులు మహేష్‌, అందే శివ కోటయ్య, నాయకులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు.