Jul 27,2022 22:08

అభివృద్ధి, సంక్షేమం జగనన్నకే సాధ్యం: ఎమ్మెల్యే
ప్రజాశక్తి- యాదమరి :
అభివృద్ధి, సంక్షేమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నకే సాధ్యమని పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్‌.బాబు పేర్కొన్నారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పట్రాపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పచ్చపూరు, పాచిగుంట, కనికాపురం గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గ్రామంలో సిమెంట్‌ రోడ్లు, తాగునీటి ట్యాంకులు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలని ప్రజలు వారి దష్టి తీసుకొచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇళ్లు మంజూరు చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాటి అమలును వాలంటీర్లు సచివాలయ సిబ్బంది సక్రమంగా అమలయ్యే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో జెడ్‌పి వైస్‌చైర్మన్‌ బి.ధనుంజయరెడ్డి, మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు సురేష్‌ బాబు, ఉపాధ్యక్షులు హరినారాయణ రెడ్డి, రవీంద్ర, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మనోహర్‌రెడ్డి, తహశీల్దార్‌ చిట్టిబాబు, ఎంపీడీఓ శివరాజ్‌, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.