May 03,2023 22:43

ప్రజాశక్తి - పాలకొల్లు
              పాలకొల్లు ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అన్ని విధాలా అభివృద్ధి చెందిందని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజరాజేశ్వరి అన్నారు. బుధవారం కళాశాలలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా పాలకొల్లుతో పాటు 14 అటానమస్‌ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. కళాశాల అన్నివిధాలా అభివృద్ధి చెందిందని, వచ్చే నెల నాక్‌ టీం మూడో సారి కళాశాలకు వస్తున్నారని తెలిపారు. తమ కళాశాలలో ఆఖరి సంవత్సరం ఐదో సెమిస్టర్‌లోనే చదువుతూ 178 మంది విద్యార్థులు రూ.15 వేలు స్టైఫండ్‌ను పొందుతున్నారన్నారు. కళాశాలలో ఆక్వా కల్చర్‌ కోర్సుతో పాటు పలు కోర్సులకు ఇతర జిల్లాల వారు ప్రవేశాలు పొందుతున్నారన్నారు. ఇంటర్‌ ఫలితాలు రావడంతో పలువురు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రవేశాలు కోరుతున్నారని చెప్పారు. కళాశాలలో ఉన్న ఇతర సౌకర్యాలు ఆమె వివరించారు.