Oct 16,2023 20:00

రక్తదానం చేస్తున్న దృశ్యం

రక్తదానం చేస్తున్న దృశ్యం
అభివృద్ధి ప్రదాత 'తిరుమూరు'కి జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి-కోవూరు :మండల పరిధిలోని పోతి రెడ్డి పాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేత ప్రజాభిమాని, అభివృద్ధి ప్రదాత తిరుమూరు అశోక్‌ రెడ్డికి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఆయన నివాసంలో 20కిలోల కేక్‌ కట్‌ చేసి ఆయన్ని గజమాలతో అభిమానులు సత్కరించారు, ఈ సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తాన్ని పలువురు దానం చేశారు. వారికి బ్లడ్‌ బ్యాంక్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థ సర్టిఫికెట్‌లను అశోక్‌ రెడ్డి అందజేశారు. అశోక్‌ రెడ్డి సతీమణి వాణి గతంలో పంచాయతీ సర్పంచ్‌ గా పని చేసి భర్త అండతో గ్రామాభివృద్ధి చేపట్టింది, పార్టీలకు అతీతంగా జన్మదిన వేడుకలకు వార్డ్‌ మెంబెర్స్‌ కూడా రావడం విశేషం. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చిన వెంటనే స్పందించే తత్వం ఉన్న అశోక్‌ రెడ్డికి అభిమాన వర్గాలు వెల్లువ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అన్నదానం కార్యక్రమం కూడా భారీ ఎత్తున చేపట్టారు.కార్యక్రమంలో ఎంపిటిసి యుద్ధలపూడి నాగరాజు, మాజీ సర్పంచ్‌ ఎంగి రేకుల కష్ణ ప్రసాద్‌, తిరుమూరు రవీంద్ర రెడ్డి, జీవీ నాగరాజు, కొల్లా మధు రెడ్డి, ఆది శేషా రెడ్డి, వహిద్‌, మాజీ కో ఆప్షన్‌ సభ్యులు జహంగీర్‌, అశోక్‌ రెడ్డి సేవా సమితి, మొత్తం పై 33యూనిట్లు రక్తాన్ని సేకరించారని తెలిపారు.