Jul 12,2023 21:28

ప్రజాశక్తి - పెనుగొండ
           మండలంలోని సిద్ధాంతం గ్రామంలో డ్రెయినేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో జరుగుతున్న డ్రెయినేజీ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒ ఏసుబాబు, ఎంపిటిసి సభ్యులు చిన్నం ఏడుకొండలు, సత్తిబాబు, చింతపల్లి ప్రసాద్‌, కేశవరపు గణపతి, పూరిల్ల శ్రీను, మాకా సామేలు పాల్గొన్నారు.