అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నగరంలోని 39వ వార్డు పరిధిలో జరుగుతున్న అభివద్ధి పనులను నగర మేయర్ ఎస్.అముద మంగళవారం పరిశీలించారు. 39వ వార్డు పరిధిలో గోకులంవీధిలో గడప గడపకు ప్రభుత్వం నిధులు రూ.5లక్షలతో జరుగుతున్న సీసీ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మిగిలిన పనులు వేగంగా ప్రారంభించి పూర్తి చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.










