అనంతపురం : శ్రీ కష్ణదేవరాయల యూనివర్సిటీలో వివిధ అభివద్ధి పనులను గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. ముందుగా యూనివర్సిటీ ప్రాంగణంలో శ్రీకష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అకడమిక్ బ్లాక్‌ను ప్రారంభించారు. తదనంతరం యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఆ తరువాత మెన్స్ బాలుర హాస్టల్‌ను ప్రారంభించారు.
విజయనగర్ లా కళాశాలలో గవర్నర్..
అనంతపురంలోని హౌసింగ్‌బోర్డులో ఉన్న శ్రీ విజయనగర్ కాలేజ్ ఆఫ్ లా పీజీ స్టడీస్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించారు. కళాశాలలో లైబ్రరీ, మూట్ కోర్ట్ ఆదనవు భవన నిర్మాణాలకు గవర్నర్ శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులతో గవర్నర్ కాసేపు ముచ్చటించారు. ఆడిటోరియం ఎదుట న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ వెలువరించిన తీర్పుల వివరాలున్న ఫ్లెక్సీ బోర్డును తిలకించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విజయనగర్ కాలేజ్ ఆఫ్ లా ఫౌండర్ ఛైర్మన్ రామిరెడ్డి, కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి, అడ్వకేట్ హరికష్ణ, ప్రిన్సిపల్ డా||రాఘవేంద్ర చారి పాల్గొన్నారు.
గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు
చిలమత్తూరు : ఎస్‌కెయు స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ కార్యక్రమాలను ముగించుకుని తిరుగుప్రయాణం అయ్యారు. అనంతపురం నుంచి రోడ్డు మార్గం ద్వారా సోమవారం సాయంత్రం శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ చెక్ పోస్ట్ సమీపంలోని రక్ష అకాడమీ వద్దకు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. కలెక్టర్ పి.అరుణ్ బాబు, సంయుక్త కలెక్టర్ టిఎస్.చేతన్, ఎస్పీ మాధవరెడ్డి, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తదితరులు గవర్నర్‌ను కలిసి వీడ్కోలు పలికారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి, రోడ్డు మార్గం ద్వారా బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.










