అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు
జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు వెల్లడి
ప్రజాశక్తి- వికోట: మండల పరిధిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ యువరాజ్ ఎంపీడీవో బాలాజీలతో ఆయన మండల అభివద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనలు మేరకు అమలవుతున్న గడపగడపకు మీ ఎమ్మెల్యే కార్యక్రమాల్లో ప్రతి సచివాలయ పరిధిలో రూ.20లక్షలు ఖర్చు చేసే విధంగా జీవో విడుదలైందని, అదే విధంగా ప్రతి ఎమ్మెల్యే పరిధిలో రెండు కోట్ల రూపాయలు ప్రజాసంక్షేమానికి అభివద్ధికి ఖర్చు చేసే వెసులుబాటు కల్పించారన్నారు. ఎంపీ నిధులతో పాటు జిల్లా పరిషత్ మండల పరిషత్ స్థానిక గ్రామ పంచాయతీలకు ఉన్న ఆర్థిక వనరులను అభివద్ధి పనులకు వెచ్చించే వెసులుబాటు ఉందని వారు తెలిపారు. మండల పరిధిలో జరుగుతున్న అభివద్ధి పనులను వేగవంతం చేయాలని జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఎంపీపి యువరాజ్ ఎంపిడిఒ బాలజీని ఆదేశించారు.










