Oct 19,2023 22:54

ఆమదాలవలస : కరపత్రాలను పంచుతున్న రవికుమార్‌

* టిడిపి జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌
ప్రజాశక్తి- ఆమదాలవలస:
 అభివృద్ధి నిరోధకుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. గురువారం పురపాలక సంఘ పరిధిలోని మెట్టక్కి వలసలోని కుప్పిలివారివీధి, చిన్నబజార్‌లో బాబుతో నేను కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీని ఇస్తూ నిత్యం ప్రజల మధ్య ఉన్న చంద్రబాబును అర్థరాత్రి వేళ అనాగరికంగా అరెస్టు చేసిన విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూశారని అన్నారు. రాజకీయ కక్షతో అక్రమ కేసు పెట్టారన్నారు. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ప్రజల నుండి 9261292612 నెంబర్‌కు మిస్డ్‌కాల్‌ ప్రజల చరవాణి నుండి ఇప్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మొదలవలస రమేష్‌, లంక నాగరాజు, నాగళ్ల మురళీధర్‌, బోర గోవిందరావు, ఇంజరాపు విశ్వనాథం, తంగి గురయ్య, కూన రమేష్‌, అన్నెపు సూరిబాబు పాల్గొన్నారు.
పొందూరు: మండలం తాడివలస గ్రామంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి నాయకులు గురువారం బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, అరాచక విధానాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తమ్మినేని మనెమ్మ, పాల్గున, భాస్కరరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.