Mar 31,2022 22:19

మాట్లాడుతున్న ఛైర్మన్‌


ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌:
మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డుల్లో స్థానిక ప్రజలకు నీటి కోరత రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఎండలను దృష్టిలో ఉంచుకోని, రానున్న రోజుల్లో కూడా మరింతగా తాగునీటిపై సమస్యలు తలెత్తకుండా చిన్నపాటి సమస్యలైవైనా ఉంటే వాటిని పరిష్కరించాలన్నారు. నియోజికవర్గ ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో చేసినటువంటి అభివద్ధి పనులు పుత్తూరు మున్సిపల్‌ పార్కు 1 కోటి 10 లక్షలు రూపాయలు, మైనారిటీలకు షాదిమహాల్‌కు 1 కోటి 85 లక్షలురూపాయలు, మున్సిపాలిటీ నూతన భవనంకు 2 కోట్ల రూపాయలు, చిన్నబ్బ నాయుడు కండ్రిగ నుండి కుంది మంగళంగుంట వరకు 40 లక్షల రూపాయలతో సిసిరోడ్డు, వెంకటేశ్వర హాస్పిటల్‌ నుండి బ్రిడ్జ్‌ వరకు 25 లక్షలతో సిసిరోడ్డు, స్మశాన వాటిక అభివృద్దికి 40 లక్షలు కేటాయించామన్నారు. డ్రైనేజీ కాలువ నిర్మాణం, వీధి దీపాల పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.