అవినీతి రహిత సమాజం కోసం కషి
యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు
ఆదివారం ఎస్వియూలోని శ్రీనివాస ఆడిటోరియంలో రామచంద్రాపురం, తిరుపతి రూరల్, చంద్రగిరి మండల కేంద్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు అభివద్ది, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు తోడ్పాటునందించాలన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు చర్యలు తీసుకుంటుంన్నామన్నారు. తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు నిత్యం ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. రూరల్ పరిధిలో రూ.35 కోట్ల నిధులతో అభివద్ధి పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారిని, తుడ సెక్రటరీ లక్ష్మీ, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపిడిఓలు, తహశీల్దార్‌లు పాల్గొన్నారు.










