Sep 14,2023 22:41

అభివద్ధికి నిధుల కొరత లేదు

అభివద్ధికి నిధుల కొరత లేదు
- జడ్‌పి చైర్మన్‌ శ్రీనివాసులు
ప్రజాశక్తి -వి కోట : జిల్లాలో జరుగుతున్న అభివద్ధి సంక్షేమ పథకాల అమలు కు నిధులు కొరత రానివ్వబోమని చిత్తూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు. మండల కేంద్రమైన వి కోటలోని శ్రీ శక్తి భవనం వద్ద గురువారం ఎంపీపీ యువరాజ్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అభివద్ధి పనులకు నిధుల కొరత లేదని మండల పరిధిలో చేపట్టిన నాడు నేడు పథకం పనులను వంద శాతం పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విద్యా వ్యాప్తి కోసం చేపట్టిన చర్యలు దేశం లోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన సచివాల వ్యవస్థలో ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని వాటిని అర్హులకు అందించేందుకు వాలంటీర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. నవరత్నాలు పథకం ద్వారా అభివద్ధి పనులను ప్రజలకు అందించగలిగామన్నారు. అంతకు ముందు శాఖల అధికారులు తమ పరిధిలో జరిగిన అభివద్ధి పనుల వివరాలను సభ దష్టికి తీసుకొచ్చారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ,అర్హరులైన ప్రతి ఒక్కరూ ఓటర్లు గా నమోదు చేసుకోవాలని తహశీల్దార్‌ చిట్టిబాబు సూచించారు. అంతరాష్ట్ర సరిహద్దు మండలమైన రిపోర్టర్లు దొంగ ఓట్లు నమోదును అరికట్టేందుకు ఓటరు జాబితాకు ఆధార్‌ ను అనుసంధానం చేయాలని జడ్పీ చైర్మన్‌ సూచించారు. డీకేటి భూములు విక్రయించే హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దానికి రైతులు సహకరించాలని తహశీల్దార్‌ కోరారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వివరాలను ప్రజలకు తెలియజేసి వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని వైద్య శాఖ అధికారులు కోరారు. ఈనెల 30 నుండి ప్రతి కుటుంబం నుండి గుర్తించిన దీర్ఘకాలికవ్యాధులు ఉన్న వారికి వైద్య సహాయం అందించనున్నట్లు తెలిపారు. వి కోట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో తాగునీటి సమస్య ను తీర్చిన జడ్పీ చైర్మన్‌ కు కతజ్ఞతలు తెలిపారు. మండలంలోని జగనన్న కాలనీలకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసామని అర్హులైన రైతులకు యుద్ధ ప్రాతిపదికన బోర్‌ బావులకు విద్యుత్‌ కనెక్షన్లు అందించాలని అధికారులను ఆదేశించారు. జేజేఎం పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందే విధంగా ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలోని అన్ని సచివాలయాలకు మరుగుదొడ్లు మంజూరు చేశామని వాటి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. తీవ్ర వర్షంతో మండలంలో వేరుశనగ సాగు గణనయంగా తగ్గిందని ప్రత్యామ్నాయంగా 80శాతం సబ్సిడీతో ఉలువలు అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు సభ దష్టికి తీసుకొచ్చారు. మండలంలో మంజూరై ఇంకా ప్రారంభం కానీ ఇళ్లను ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు 100శాతం పూర్తి చేసేందుకు కషి చేయాలన్నారు. సర్పంచులు ఎంపీటీసీలు గ్రామస్థాయిలో లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులకు సహకరించాలన్నారు. మండలంలోని 46 గ్రామ సమైక్యలలో సుమారు 18,600 మంది సభ్యులు ఉన్నారని అర్హులైన ప్రతి మహిళకు జగనన్న ఆసరాఅందే విధంగా సిబ్బంది కషి చేయాలన్నారు. మండలంలో జగనన్న పాల వెల్లువ ద్వారా ప్రస్తుతం రోజుకు 20వేల లీటర్లు పాలు సేకరణ జరుగుతుందని దీనిని పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ గ్రాంట్లు కింద మండల పరిధిలో చేపట్టిన రోడ్ల వివరాలు సభ్యులకు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో అభివద్ధి పనులు మౌలిక వసతులు కల్పించి జిల్లాలో మండలాన్ని ఆదర్శంగా నిలపాలన్నదే తన లక్ష్యమని జడ్పీ చైర్మన్‌ సభ్యులకు వివరించారు. సమావేశానికి హాజరుకాని ఆర్‌ అండ్‌ బి అధికారులకు మెమో అందించాలన్నారు. మండలంలోని శ్మశాన వాటికల అభివద్ధి, ఆధునికరణకు మౌలిక వసతుల కల్పనకు జిల్లా పరిషత్‌ నుంచి నిధులు విడుదల చేస్తామన్నారు. మండలంలో ఉద్యాన శాఖ అధికారులు అర్హులై న రైతులకు సబ్సిడీలు త్వరితగతిన అందజేయాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల దాడుల నుండి ప్రజలను రక్షించాలని పంటలను కాపాడాలని సభ్యులు కోరారు. బాలికల వసతి గహ ప్రహరీ గోడ నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ దశలో ఆగిపోయిన 19 అంగన్‌వాడీ కేంద్రాలు మరమ్మతులకు కూడా నిధులు విడుదల చేస్తున్నట్లు చైర్మన్‌ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సభ్యులు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాల గురునాథ్‌, జిల్లా పరిషత్‌ సలహా మండలి సభ్యులు గౌస్‌, వైస్‌ ఎంపీపీలు లక్ష్మణ్‌ రెడ్డి ,తమీంఖాన్‌, సింగిల్‌ విండోస్‌ అధ్యక్షులు శ్రీరాములు రెడ్డి, వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.