అభివద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయండి
అధికారుల సమీక్షా సమావేశంలో ఎంపీపీ
ప్రజాశక్తి - కార్వేటినగరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీపీ లతబాలాజీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఎంపీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రవేశపెట్టిన నాడు-నేను పథకం ద్వారా మంజూరైన పాఠశాలల పనులను అక్టోబర్ ఆఖరిలోపు పూర్తి చేయాలని, ప్రభుత్వం పేదలకు అందించిన పక్కాగహాలను సామూహిక గహ ప్రవేశాలకు ముందే పూర్తి చేయాలని, ఎన్‌ఆర్‌జిఎస్ పనులు నాణ్యతగా చేపట్టాలని సంబంధింత అధికారిని ఆదేశించారు. అరులైన ప్రతి ఒక్కరికీ రైతుభరోసా అందేలా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దష్టికి తీసుకొచ్చిన విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించి నివేధిక అందించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని పేదలకు ప్రతిష్టాత్మకంగా అందించనున్న అసైన్డుమెంట్ భూముల పంపిణీలో ఎలాంటి అవక తవకలు లేకుండా చూడాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ ధనంజయవర్మ సింగిల్ విండో అధ్యక్షుడు లోకనాధరెడ్డి, ఎంపీడీవో మోహన మురళీ, ఎంఈవో విజయకుమార్,డిటి లక్ష్మిపతి, ఏపీవా జాహ్నవి. ఏపీఎం విజయకుమార్, ఆర్.డబ్ల్యూస్ ఏఈ గిరీష్ కుమార్. అంగన్‌వాడీ పర్యవేక్షకులు ఇందిరా, షామిని అగ్రికల్చర్ ఏవొ హేమలత,పలువురు అధికారులు పాల్గొన్నారు.










