Oct 06,2022 22:30

అభిషేకం టికెట్ల ధరలు పెంచలేదు
భక్తులకు ఆందోళన వద్దు
ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మెన్‌ మోహన్‌ రెడ్డి
ప్రజాశక్తి- ఐరాల

కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి దేవస్థానంలో స్వామివారి అభిషేకం టికెట్‌ ధర రూ.700లను నుంచి రూ.5,000లకు పెంచడానికి ఆలయ అధికారులు విడుదల చేసిన అభిప్రాయ సేకరణ పత్రం ఉపసంహరించుకునేలా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, సభ్యులు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారని ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ ఏ. మోహన్‌ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ స్వామివారి అభిషేకం ప్రస్తుతం జరుగుతున్న విధానమే యథావిధిగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు లేవని భక్తులకు ఈ సందర్భంగా తెలియజేశారు. దాతల సహాయసహకాలతో నూతనంగా సుందరంగా నిర్మించిన ఆలయంలో సామాన్యుల భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారి అభిషేకం భక్తుల అందరికీ అందుబాటులో ఉండాలని నిర్ణయంతో ధర్మకర్తల మండలి అభిప్రాయ సేకరణ పత్రం సానుకూలంగా తిరస్కరించడమైందన్నారు. దీనిపై భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటన ద్వారా తెలిపారు.