Mar 23,2023 15:15
  • రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీల బ్రోచర్స్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమగోదావరి) : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఏవి సుబ్బరాజు అన్నారు. ఈనెల 30న భీమవరం టౌన్‌ హాల్లో జిల్లా బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌, శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో స్వర్గీయ ఎన్‌విఆర్‌ దాస్‌ మెమోరియల్‌ రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌, మెన్స్‌ పిజిక్‌ చాంపియన్‌ షిప్‌, మిస్టర్‌ ఆంధ్ర ఛాంపియన్‌ షిప్‌ పోటీలను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా గొల్లలకోడేరు జిల్లా పోలీస్‌ శాఖ కార్యాలయంలో క్రీడలకు సంబంధించిన బ్రోచర్స్‌ను అడిషనల్‌ ఎస్పీ ఎవి సుబ్బరాజు ఆవిష్కరించి మాట్లాడారు. యువకులంతా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఇటువంటి ఆరోగ్యకరమైన కార్యక్రమాల్లో పాల్గొని తమ జీవితాలను బంగారు బాట చేసుకోవాలని అన్నారు. నిర్వాహకులు బిక్కిన శ్రీనివాస్‌, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, 11 విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు., ప్రతి విభాగంలోనూ 6 బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. చాంపియన్‌ ఆఫ్‌ ఛాంపియన్‌, మోస్ట్‌ ముస్కులర్‌ మెన్‌, బెస్ట్‌ పోస్టర్‌ వంటి నగదు అవార్డులను కూడా . రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బిల్డర్స్‌ ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేష్‌, జి పవన్‌, మహేష్‌, ఎం అజరు, ఎస్‌ కే బాబ్జీ పాల్గొన్నారు.