ఖమ్మం : రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రజా వైద్యులు, సిపిఎం అగ్రనేత, సిపిఐ(ఎం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా పని చేసిన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి సతీమణి యలమంచిలి సరళాదేవి అనారోగ్య సమస్యలతో బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. సందర్శనార్థం సరళాదేవి భౌతికకాయాన్ని ఖమ్మంలోని యలమంచిలి పాలీక్లీనిక్ వద్ద ఉంచారు. ఆమె అంతిమ సంస్కారాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిర్వహించనున్నారు.










