Apr 24,2023 13:19

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు రైల్వే గేటు మరమ్మతు పనులు సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభించారు. రైల్వే అధికారుల నిర్ణయం వరకు తిరిగి 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు గేటును తిరిగి తెరుస్తారు. రైల్వే క్వార్టర్స్‌కు సంబంధించి మురుగుకు వెళ్లేందుకు రెండు పెద్ద సిమెంట్‌ పైపులు పెట్టే అవకాశం ఉండటంతో గేటును మూడు రోజులపాటు మూసివేస్తున్నారు. ఇప్పటికే గేటు దగ్గర రోడ్డు అధ్వానంగా తయారైంది. రైల్వే జోనల్‌ మెంబరు జక్కంపూడి కుమార్‌ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసిన మేరకు గేటు మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు .2 వ ట్రాక్‌ కు కూడా ఐరన్‌ షీట్లు వేస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.