Jul 18,2023 15:48

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్‌ : కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గడచిన ఆరు రోజులుగా నిరాహా నిరాహార దీక్షలు చేపట్టిన పాలకవర్గం అధికార వర్గాలలో చలనం లేకపోవడం దారుణమని మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు జిల్లా అధ్యక్షుడు నాగరాజు ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద రిలే దీక్షలు కొనసాగాయి ఈ సందర్భంగా నాగరాజు తదితరులు మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు 2011లో11నెలల ఈపీఎఫ్‌ సమస్య పరిష్కరించమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన, జీవో నెంబర్‌ ఎంఎస్‌ 7, ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గత ఆరు రోజులుగా మున్సిపల్‌ ఆఫీస్‌ ముందర ఆందోళన చేస్తున్న ఏమీ పట్టనట్లు మున్సిపల్‌ అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపల్‌ కార్మికుల వేతనంలో కటింగ్‌ అయినా పిఎఫ్‌ సమస్య 12 సంవత్సరాలు కావస్తు ఉన్న నేటికీపరిష్కారం చేయకుండా మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్‌ ఏడు ప్రకారం స్కిల్‌, సెమిస్కిల్‌ వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాలు చెబుతున్న మున్సిపల్‌ అధికారులు ఇవ్వకుండానిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ కార్మికులకు ఈపీఎఫ్‌ ఈఎస్‌ఐ సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు పాలకులు మారుతున్నారు తప్ప కార్మికుల సమస్య నేటికీ పరిష్కారం కావడం లేదు. కావున వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో మా పోరాటాలు ఉదతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌, లో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులు నాయకులు పాల్గొన్నారు.