ప్రజాశక్తి-పుత్తూరుటౌన్(చిత్తూరు) : మహిళా సంక్షేమమే వైయస్సార్ ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా పేర్కొన్నారు. నగరి నియోజకవర్గ వడమాలపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు వైఎస్సార్ చేయూత పంపిణి కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూత వంటీ ప్రజా సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలను కూడా సమానంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. వైస్సార్ చేయూత పథకం కింద వడమాలపేట మండలంలో 2020-21వ సంవత్సరానికి 1,561 మందికి 2,92,68,750 రూపాయలు, 2021-22 వ సంవత్సరానికి 1,715 మందికి 3,21,56,250 రూపాయలు, 2022-23 వ సంవత్సరానికి 1,866 మందికి 3,49,87,500 రూపాయలు పంపిణి చేసినట్లు తెలిపారు. ఈ కార్యకమం రాంప్రసాద్ రెడ్డి , వడమాలపేట ఎం.పి.పి, వైస్ ఎం.పి.పిలు, రాష్ట్ర కమీషన్ డైరెక్టర్లు, డిసిసిబి వైస్ చైర్మన్ , ఆలయ కమిటీ చైర్మన్లు, సభ్యులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఎం.పి.టి.సి.లు, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










