ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం ధర్మాచెరువు ఎస్సీ కాలనీలో విద్యుదాఘాతానికి గురై మంగళవారం వివాహిత మృతి చెందింది. కాలనీ సమీపంలోని మామిడి తోటలో పశువులు మేపుతుండగా ప్రమాదవశాత్తూ ఈ ఘటన చోటు చేసుకుంది. మతురాలు ధర్మాచెరువు ఎస్సీ కాలనీకి చెందిన గీత(27)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.










