పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లులోని జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ... కాయగూరల ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు అన్ని కాయగూరల ధరలు రెట్టింపు అయిన నాణ్యమైన కాయగూరలు లభ్యం కావడం లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. బీరకాయ, వంకాయ, దొండకాయ, బెండకాయ, క్యాబేజీ కిలో రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.60 కు పైగా ఉన్నాయి. మునగకాడ, మామిడికాయ ఒకటి రూ.10 నుంచి రూ.20 వరకు అమ్ముతున్నారు. మిర్చి కిలో రూ.40 నుంచి రూ.120కు పెరిగింది. దీంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. క్యారెట్, కొత్తిమీర, బీట్‌రూట్ ధరలు పెరిగాయి. నిన్నటివరకు రూ.10 అమ్మిన ఆనపకాయ ఒకటి రూ.20, రూ.40 అమ్ముతున్నారు. మరో నెల రోజులపాటు ధరలు ఇంకా పెరుగుతాయని వర్తకులు చెబుతున్నారు.










