ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : భూ కబ్జాలను అడ్డుకుంటే దాడులు చేస్తారా దళితుల జోలికి వస్తే ఖబద్దారంటూ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ హెచ్చరించారు. గత నెల 26వ తేదీ 49వ డివిజన్ చౌటపల్లి సచివాలయం వద్ద ఐదుగురు దళితులపై అగ్రవర్ణాల దాడిపై బుధవారం ఉప్పన్నగారిపల్లిలో బాధ్యత దళితులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధ్యత దళితులు వెంకటేష్, రమేష్, చైతన్యలు సంఘటన వివరాలను ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దళితుల భూములు నాక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే స్మశాన వాటికల దారిలో నాక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. కోడిగుట్ట వద్ద చోటు చేసుకున్న సంఘటనలు బాధ్యతలకు న్యాయం చేసేలా పోలీసులు వ్యవహరించడం లేదని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.










