విద్యుత్ సమస్యను పరిష్కరించకపోతే సబ్ స్టేషన్‌ను ముట్టడిస్తాం : ఎంఎల్‌ఏ నిమ్మల రామానాయుడు
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : రాష్ట్రంలో విద్యుత్ కోతలకు, చార్జీలు పెంచినందుకు నిరసనగా ... ఎంఎల్‌ఏ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో టిడిపి నేతలంతా పాలకొల్లు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రాత్రి బస చేసి శుక్రవారం ఉదయం నిరసననను విరమించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ... విద్యుత్ కోతల వలన మహిళలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, ఆక్వా రంగం కుదేలైందని, చిన్న పరిశ్రమలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నాయని అన్నారు. ఎడిఇ కి వినతి పత్రం సమర్పించారు. సిఎం జగన్ విద్యుత్ సమస్యను పరిష్కారం చేయకపోతే వందలాది మందితో సబ్ స్టేషన్‌ను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. టిడిపి హయాంలో నాణ్యమైన విద్యుత్‌ను అందించి వినియోగదారులపై భారం లేకుండా చేశారని, అయితే జగన్ 57 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసి కూడా కోతలు విధిస్తున్నారు అని విమర్శించారు. ఈ ఆందోళన లో రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు, జివి పీతల శ్రీను, కోడి విజయ భాస్కర్, బోనం నాని, పెన్మెత్స రామభద్రరాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.










