May 07,2023 13:15

ప్రజాశక్తి-భీమవరం (పశ్చిమగోదావరి) : ఎన్నో పోరాటాల ఫలితంగా ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ హక్కు పరిరక్షణకు ప్రజలంతా అల్లూరి స్ఫూర్తితో ఉద్యమించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపి మూర్తి పిలుపునిచ్చారు. విప్లవ వీరుడు అల్లరి సీతారామరాజు వర్ధంతిని యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో భీమవరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అడ్డవంతన వద్ద ఉన్న అల్లూరి కాంస్య విగ్రహంనికి పూలమాలు వేసి ఘన్నగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ.. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతామ రామరాజుని కొనియాడారు. భరతమాత మానస సంఖ్యల నుండి విముక్తి కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలారని పేర్కొన్నారు. మ్యాన్యంలో గిరిజనుల సమస్యలపై అరుపెరగని పోరాటం చేశాడన్నారు. నేడు పాలకులు అవలంబిస్తున్న విధానాలతో అల్లూరి ఆశయాలను దొంగలోకి తొక్కుతున్నారన్నారు. దేశ సంపద ప్రజలకు కాకుండా కార్పొరేట్‌ చేతుల్లోకి నేట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకొనే విధంగా ప్రజలు పోరాడ వలసిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అల్లూరి స్ఫూర్తితో తెలుగు ప్రజలు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పిఎస్‌ విజయరామరాజు, జిల్లా కోశాధికారి సిహెచ్‌ పట్టిభి రామయ్య, జిల్లా కార్యదర్శలు రామకృష్ణంరాజు, ఏసుబాబు, స్వాతి, త్రిమూర్తులు, రవిచంద్ర కుమార్‌, సుధాకర్‌, వర్మిం రాజు పాల్గొన్నారు.