ప్రజాశక్తి - ఎస్‌ఆర్‌పురం(చిత్తూరు) : జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్‌ఆర్‌పురం మండలం వెంకటాపురం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయనందరెడ్డి, సర్పంచ్ విజయ ఏకాంబరం, ఉడమల కుర్తి, సర్పంచ్ చిట్టి మహేష్ కాలప్ప, చిత్తూరు డిసిసిబి డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి, జడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి, ఎంపీపీ సరిత గురువారెడి,్డ విజయబాబు, జనార్ధన్, తహశీల్దార్ షబ్బీర్ భాష, ఎంపీడీవో కృష్ణయ్య మండల స్థాయి అధికారులు నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










