Apr 20,2023 14:53

ప్రజాశక్తి -కాళ్ల (పశ్చిమగోదావరి) : కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో లోవోల్టేజ్‌ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కాళ్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను గురువారం ముట్టడించారు. మండుటెండలో ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకుని ఆందోళనకారులకు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మద్దతు తెలిపారు. శుక్రవారం నాటికీ 63 కెవి విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లో వోల్టేజ్‌ సమస్యను పరిష్కరించుకుంటే గ్రామస్తులతో కలిసి ఉద్యమిస్తామని ఉండి ఎమ్మెల్యే మంతెన రామ రాజు అధికారులను హెచ్చరించారు.