ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరుజిల్లా) :గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం దేవళంపేటలో 'రైతు దినోత్సవం' వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గాండ్ల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మేలిపాటి పురుషోత్తం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు అధ్యక్షుడు పెద్దిరెడ్డిగారి ఉమాచంద్రారెడ్డి, ఎంపీటీసీ కొత్తపల్లి భాస్కర్, దేవళంపేట జడ్పీ ఉన్నత పాఠశాల తల్లి దండ్రుల కమిటీ చైర్మన్ జి.ఉమాపతి తదితరులు హాజరయ్యారు.










