Apr 10,2023 11:10

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : బైక్‌ను లారీ ఢీకొట్టడంతో విఆర్‌ఓ కు తీవ్రగాయాలైన ఘటన సోమవారం మండల పరిధిలోని ఏ కొండాపురం గ్రామం వద్ద జరిగింది. కడవకల్లు విఆర్‌ఓ పెద్దన్న కడవకల్లు సచివాలయానికి తాడపత్రి నుంచి కడవకలకు బైక్‌పై బయలుదేరగా ఏ కొండాపురం వద్దకు రాగానే వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న విఆర్‌ఓ పెద్దన్న కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.