పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : వీఆర్‌ఏల కనీస వేతనం 26,000 కు పెంచాలని వీఆర్‌ఏలకు ఇంటర్మీడియట్ తో ప్రమోషన్ కల్పించాలని నరసాపురం డివిజన్ లోని వీఆర్‌ఏలు డా. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాలకు చెందిన వీఆర్‌ఏలు పాలకొల్లు అంబేద్కర్ విగ్రహం వద్ద తమ దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. నామినీగా పనిచేస్తున్న వీఆర్‌ఏల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం డివిజన్ వీఆర్‌ఏల సంఘం అధ్యక్షులు మోటూరి మోషే ,పాలకొల్లు మండల అధ్యక్ష ,కార్యదర్శులు టి గోవిందరావు, టి వెంకటేశ్వరరావు డి నాగేశ్వరరావు, ఎన్ తాతారావు, పెచ్చెట్టి ఏడుకొండలు , పెచ్చెట్టి నరసింహమూర్తి పాల్గొన్నారు.










