Jul 20,2023 12:38

ప్రజాశక్తి-పోడూరు(పశ్చిమగోదావరి) : విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సమస్యలు నెరవేర్చాలని కోరుతూ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల విఆర్‌ఎల సెక్రటరీ కడిమి ఏసు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, డిఎ రికవరీ విధానం ఆపాలని, డిఏ, టీఏలతో కూడిన వేతనం ఇవ్వాలని ప్రతిపక్ష నేతగా ఉండి సీఎం జగన్‌ పాదయాత్రలో విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నల్లి సుమన్‌, ఉపాధ్యక్షుడు కంతేటి సూర్యనారాయణ మండల విఆర్‌ఎలు పాల్గొన్నారు.