మడకశిర (అనంతపురం) : గుర్తు తెలియని ఒక మహిళ, ఒక యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఘటన శుక్రవారం మడకశిర పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ పాత భవనంలో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. యువకుడు మృతి చెందినట్లు గుర్తించారు. మహిళ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పూర్తి వివరాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










