ప్రజాశక్తి-బివెదురుకుప్పం(చిత్తూరు) : యుటిఎఫ్ వెదురుకుప్పం మండల కార్యవర్గ సభ్యులు మండల విద్యాశాఖ అధికారి కె.శంకరయ్యను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శంకరయ్య మాట్లాడుతూ.. మండలంలోని ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జి.దేశయ్య, కె.జయచంద్రారెడ్డి, మర్దాల శ్రీనివాసులు, ఎస్.రామ్మూర్తి, డి.పీతాంబరరెడ్డి, ఎస్.చెన్నకేశవులు, కె.బాబు, బి.కల్పన, యు.పురుషోత్తం, పి.లోకనాథం, ఎ.సుభాషిణి, బి.కామరాజు, పి.గురునాథం, ఒ.అమరావతి పి.సిద్ధిలక్ష్మి, డి.బాలసుబ్రమణ్యం, ఎమ్.డానియల్, బి.శంకర్, టి.రామచంద్రయ్య, డి.జి.కవిత, బి.మురగయ్య, ఎ తులసమ్మ తదితరులు పాల్గొన్నారు.










