
కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారాలను ప్రముఖ రచయిత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు, పరివర్తన పత్రిక సంపాదకులు కొరివి వినరు కుమార్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రముఖ కవి పాపినేని శివశంకర్‌లకు ఈ ఏడాది ఇస్తున్నాము. సాహిత్య సామాజిక రంగాల్లో విశేష కషికి గుర్తింపుగా ఈ పురస్కారాలను జనవరి 9, 2023 సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో ప్రదానం చేస్తున్నాము. ఈ సందర్భంగా జరిగే సభలో త్రిపురనేని రామస్వామి చౌదరి - సమకాలీనత అంశంపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ప్రసంగిస్తారు. కవి, జర్నలిస్ట్ బి విల్సన్ అధ్యక్షత వహిస్తారు. కడియం జేమ్స్, బి.శ్యాంబాబు పాల్గొంటారు.