Mar 24,2023 13:13

తణుకు రూరల్‌ (పశ్చిమ గోదావరి) : ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో కూలి మృతి చెందిన ఘటన శుక్రవారం తణుకు మండలంలో జరిగింది. తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై ఇటుకల లోడుతో తణుకు నుంచి తేతలి వైపు వెళుతున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ పై ప్రయాణిస్తున్న పశ్చిమ బెంగాల్‌ కు చెందిన కూలీ ట్రాక్టర్‌ కిందపడి ఊపిరాడక మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.