Apr 04,2023 16:06
  •  చించినాడ మాజీ సర్పంచి కేతా సూర్యారావు

ప్రజాశక్తి-బియలమంచి (పశ్చిమగోదావరి) : మండలంలోని ఏనుగువానిలంక పరిధిలో ఉన్న చించినాడలోని ఎస్‌సి, బీసీలకు చెందిన లంక భూముల నుండి ఇసుకను బయటకు తరలిస్తే సహించేది లేదని చించినాడ గ్రామ మాజీ సర్పంచి కేతా సూర్యరావు హెచ్చరించారు. లంక భూముల నుండి తిరిగి ఇసుకను తరలించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గ్రామస్థులతో కలిసి ఆయన ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యరావు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా పేదల ఆధ్వర్యంలో ఉన్న లంక భూముల్లో ఇసుకను బయటికి తరలించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇసుకను బయటికి తరలించే ప్రక్రియను ఆపకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కౌరు పెద్దిరాజు, గొల్ల ఏడుకొండల శ్రీనివాస్‌, చిట్టి చిట్టి బాబు తెన్నేటి స్టాలిన్‌ మురాలా రాజేష్‌, ముమ్మిడివరపు కేతా రాము, ఆంజనేయులు , తెన్నేటి శివాజీ,పల్లేరు వెంకటస్వామి, దానియేలు,నాని తదితరులు పాల్గొన్నారు.