Jun 01,2023 14:29
  • పశువర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జాఫర్‌

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమగోదావరి) : కల్తీ లేకుంటే పాలను మించిన పోషకాహారం లేదని, కల్తీ జరగకుండా ప్రభుత్వమే నిరంతర పర్యవేక్షణ చేయాలని, చిన్న, పెద్ద డైరీలు, సహకార సంఘాలు, నష్టాల బారిన పడకుండా సహకరించాలని పశు సంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎండి జాఫర్‌ అన్నారు. భీమవరం పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ప్రపంచ పాల దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యనారయణ, సుధీర్‌ బాబు మాట్లాడుతూ పాలు 100 శాతం పోషక విలువలు, విటమిన్‌ బి12 అధికంగా కలిగిన ఆహారమని అన్నారు. యువత , విద్యార్థుల్లో, మానసిక, శారీక ఉత్సాహాన్ని, పెరుగుదలను, ఎముకల పటుత్వాన్ని కలిగిస్తాయని అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక నాయకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ.. డైరీల్లో పాలు నిల్వవుండేందుకు అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారని, వీటి వల్ల పాలల్లో పోషకాల సంఖ్య తగ్గిపోతోందనారు., పాల ఉత్పత్తులో ప్రపంచంలో మన దేశం అగ్రభాగాన ఉన్నా వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డామని అన్నారు. అనంతరం ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో గంటా సుందర కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.