May 20,2023 11:41

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని దొంగతనం కేసుల్లో 40 మోటార్‌ సైకిళ్ళు, 158 సెల్‌ ఫోన్లును సీజ్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్‌ చెప్పారు. శనివారం పాలకొల్లు పోలీస్‌ స్టేషన్‌ లో ఎస్పీ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. సెల్‌ ఫోన్లు విలువ రూ 23,70,000 ఉంటుందని, ఇప్పటివరకు జిల్లాలో 600 ఫోన్లు రికవరీ చేశామని, వాటి విలువ రూ.90 లక్షల విలువ ఉంటుందని ఎస్పీ తెలిపారు. సెల్‌ ఫోన్లు పోతే ఒక సెల్‌ నెంబర్‌ ఇచ్చామని దానికి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. మీడియా సమావేశం లో నరసాపురం డిఎస్పి మనోహర్‌, పాలకొల్లు సిఐ డి.రాంబాబు, ఎస్‌ఐ లు బాదం శ్రీనివాస్‌, ముత్యాలరావు, విజయలక్ష్మి పాల్గొన్నారు. ముద్దాయిలను పెట్టుకున్న పోలీసులకు నగదు అందించారు. త్వరలో వీరికి రివార్డులు ఇస్తామని ప్రకటించారు.