- స్వాతంత్ర దినోత్సవ వేళ సన్మానించిన శాలువా, హాట్ బాక్సులు వెనక్కు ఇచ్చి నిరసన
ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : 77వ స్వాతంత్ర దినోత్సవ వేళ కలెక్టర్ చేతులు మీదుగా అందజేసే అవార్డులకు కార్మికులను ఎంపిక చేయకుండా కమిషనర్ భాగ్యలక్ష్మి అవమానించారని దీనికి నిరసనగా తమను సన్మానించి కప్పిన శాలువా హాట్ బాక్సులను సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సావిత్రికి అందజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా కార్మికుల తలరాత మారటం లేదని ధ్వజమెత్తారు. నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకై నడుం బిగించే కార్మికులను ప్రభుత్వ అవార్డుకు ఎంపిక చేయకుండా కమిషనర్ కార్మికులను వంచించారన్నారు. ఉన్నతాధికారులను ప్రభుత్వ అవార్డుకు ఎంపిక చేసి కార్మికులు మాత్రం పాలకవర్గం కమిషనర్ కలిసి హాట్ బాక్స్ చెప్పాలని చేతికిచ్చి అవమానించడం సరైన పద్ధతి కాదన్నారు. కమిషనర్ వైఖరి పట్ల కార్మికులు తీవ్ర మనోవేదన గురైనన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను ప్రాణంగా పెట్టి పని చేసిన కార్మికులను అవమానించడం ద్వారా సన్మానించినట్లు అయిందన్నారు. కార్మికులు ఎప్పుడు నిబద్ధతతో వృత్తి పట్ల అంకిత భావంతో ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారే కానీ అధికారులు మాత్రం వారిని చిన్న చూపు చూడటం తగదన్నారు. కార్మికులకు బకాయి ఉన్న తొమ్మిది నెలల ఈపీఎఫ్ అమౌంట్ ఇప్పటివరకు ఖాతాలో జయమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మార్లు ఉన్నతాధికారులు కలిసి విన్నవించిన.. స్పందనలో 50 సార్లు వినతి పత్రాలు అందజేసిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. 60 సంవత్సరాల పేరుతో తొలగించిన 12 మంది ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరిన పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వాపోయారు. అనారోగ్యం, ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మిక కుటుంబ సభ్యులకు ఒకరికి ఉపాధి కల్పించి ఈపీఎఫ్ ఈఎస్‌ఐల ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఇప్పించాలని కోరిన ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ఈపీఎఫ్ ఈఎస్‌ఐ లలో ఉన్న తప్పులను సవరించి కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరా కార్మికుల పట్ల సవతి ప్రేమ చూపుతున్న అధికారుల వైఖరికి నిరసనగానే స్వాతంత్ర దినోత్సవం రోజున సన్మానం పేరుతో శాలువాలు కప్పి హాట్ బాక్స్ ల పేరుతో చిప్పలు ఇచ్చిన నందుకు నిరసనగా వాటిని వెనక్కు ఇచ్చి వేస్తున్నామని వారు ప్రకటించారు. తర్వాత ఉన్నతాధికారుల ఛాంబర్ లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈనెల 24వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి కార్మికులంతా తరలి వెళ్తున్నట్లు కమిషనర్ భాగ్యలక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు.










