ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : వెదురుకుప్పం మండలంలోని మాంభేడు సచివాలయం పరిధిలోని వెటర్నరీ అసిస్టెంట్ కావేరి పాడి రైతులకు చేసిన సేవలు అభినందనీయమని జెడ్పీటీసీ చల్లంపాళ్యెం సుకుమార్ అన్నారు. వెటర్నరీ అసిస్టెంట్ కావేరి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆమెకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ చల్లంపాళ్యెం సుకుమార్ ఆమెకు శాలువా కప్పి సత్కారించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గుణశేఖర్, డిడి వో సుబ్రమణ్యం, కార్యదర్శి నాగరాజు, విఆర్‌ఓ క్రృష్ణయ్య, ఉపాధ్యాయులు దేశారు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










