ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : ధాన్యం కొనుగోలులో ఎటు వంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం పాలకొల్లు మండలం దగ్గులూరు, ఆగర్రు గ్రామాలలో రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టరు ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎంతమంది రైతులు వచ్చారు. ఎంత ధాన్యం కొనుగోలు చేశారని కలెక్టరు అడిగి తెలుసు కున్నారు. రిజిష్టర్లు, తేమ శాతం చూసే మిషన్ , కాటా, స్టాక్ రూమ్‌లను జిల్లా కలెక్టరు పరిశీలించారు. దగ్గులూరు ఆర్‌బికెలో 85 మంది రైతులు నుండి 578 మెట్రిక్ టన్నులు, ఆగర్రు ఆర్ బి కె లో 91 మంది రైతులు నుండి 745 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రైస్ మిల్లులు నుండి ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎక్కడా ధాన్యం కొనుగోలుకు అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు.
- జగనన్న ఇళ్ల నిర్మాణం పరిశీలన
నిరు పేదల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసి గృహా ప్రవేశాలకు సిద్ధం చెయ్యాలని కలెక్టరు పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలకొల్లు మండలం చందపర్రు గ్రామం జగనన్న లే అవుట్‌ను జిల్లా కలెక్టర్ అకస్మిక తనిఖీలు చేశారు. ఈ నెల ఆఖరుకు మిగతా ఇండ్ల నిర్మాణాల పూర్తి పురోగతి చూపాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను కలెక్టరు ఆదేశించారు.
- సప్లిమెంటరీ పరీక్షల ప్రత్యేక తరగతులు పరిశీలన
పాలకొల్లు పురపాలక సంఘం పరిధిలో కోకోనట్ , ఏయస్ యన్ యం జూనియర్ కాలేజీలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షల్లో వారు ఉత్తీర్ణత చెందడానికి మోడల్ పేపర్లను అందజేయడం, చదివినది రాయించడం తదితర ప్రత్యేక చర్యలు తీసుకుని ఉత్తీర్ణతకు దోహదపడాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు తక్కువ రోజులు గడువు ఉందని ఇదే విధంగా సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమ వసతి గహాల్లో చదువుతున్న విద్యా ర్థులకు కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సి హెచ్ పెద్ది రాజు ,యంపిడివో సంగాని. వేంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి యస్. అబ్దుల్ రహీమ్,గహా నిర్మాణ శాఖ డి ఇ ఆర్.త్రిమూ ర్తులు, కళాశాలల ప్రధానో పాద్యాయులు , అధ్యాపకులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఆర్ బి కె సిబ్బంది , రైతులు , తదితరులు పాల్గొన్నారు .










