ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం నగరంలోని కారు ఓనర్స్ మరియు డ్రైవర్స్ అసోసియేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో లలిత కళాపరిషత్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రం ను సీపీఎం ఒకటవ డివిజన్ కార్యదర్శి వి.రామిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఎం ఒకటవ డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ నగరంలో వివిధ పనులు నిమిత్తం సుదూర ప్రాంతాలు నుంచి వచ్చే ప్రజలకు సీఐటీయూ అనుబంధ కారు డ్రైవర్స్ మరియు ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమములో సీఐటీయూ నాయకులు లతీఫ్, కారు డ్రైవర్స్, ఓనర్లు పాల్గొన్నారు.










