ప్రజాశక్తి-నార్పల(అనంతపురం) : సింగనమల్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా నార్పలకు చెందిన తేరుకాటి అమీర్ భాషా నియమితులయ్యారు. ఈ సందర్భంగా అమీర్ భాష మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందుబాటులో ఉండి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు.. తనను మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా నియమించిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నార్పల సత్యనారాయణ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమీర్ భాషాను పలువురు వైసీపీ నాయకులు, ప్రత్యేకంగా పూలమాలలు వేసి అభినందలు తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఖాదర్ వలిఖాన్, జీలన్ భాషా, గుత్తి గోపాలరెడ్డి, మార్కేట్ యార్డ్ డైరెక్టర్, మాజీ కో ఆప్షన్ నెంబర్ దాడితోట భాష, గొల్ల సుధాకర్, రాజు, పాముల ప్రకాష్, సోమనాథ్, ప్రభాకర్, రాజాక్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.










