ప్రజాశక్తి-పుంగనూరు (చిత్తూరు) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రోడ్ షో పర్యటన లో భాగంగా ... పుంగనూరులో శుక్రవారం ఉద్రిక్తత ఏర్పడింది. నియోజకవర్గంలోని 6 మండలాల నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పుంగనూరుకు చేరుకున్నారు. స్థానిక ఇందిరా సర్కిల్లో వైసిపి నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలు చేత పట్టుకుని ' చంద్రబాబు గో బ్యాక్ '... సాగు నీరు, తాగునీరు అడ్డుకున్న చంద్రబాబు 420 అంటూ... నినదించారు. ఇందిరా సర్కిల్లో నిరసన అనంతరం ప్రైవేటు బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకొని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉద్రిక్తత నేపథ్యంలో... ఈరోజు ఉదయం నుండి పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు.










