May 06,2023 12:58

ప్రజాశక్తి-అనంతపురం : ఉద్యోగులను వేధిస్తున్న డిఎస్సీ సునీల్‌ నాయక్‌ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ ఉద్యోగులు హెచ్చెల్సీ కార్యాలయం ముందు శనివారం ఏపీ ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉద్యోగులను వేధిస్తున్న సునీల్‌ పై చర్యలు తీసుకోవాలని చెబుతున్నా ఎస్‌ఈ స్పందించడము లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎపి ఎన్జీవో సంఘం నగర అధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి, ఇరిగేషన్‌ ఉద్యోగుల సంఘము నాయకులు, శ్రీనివాసులు, ఉద్యోగులు పాల్గొన్నారు.